బుధవారం 23 సెప్టెంబర్ 2020
Sports - Sep 12, 2020 , 16:19:31

మొద‌ట్లో ఇబ్బంది ప‌డినా.. ఇప్పుడు కుదురుకున్నాం : విరాట్‌

మొద‌ట్లో ఇబ్బంది ప‌డినా.. ఇప్పుడు కుదురుకున్నాం : విరాట్‌

ఐపీఎల్ 2020 కోసం ఆర్‌సీబీ ఆట‌గాళ్లు నెట్స్‌లో చెమ‌టోడుస్తున్నారు. 10 రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తూ సెప్టెంబ‌ర్ 21న హైద‌రాబాద్‌తో జ‌రుగ‌బోయే తొలి మ్యాచ్ కోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నామ‌ని విరాట్ కోహ్లి అన్నాడు. ప్రాక్టీస్ విష‌యంలో మొద‌ట్లో కాస్త ఇబ్బంది ప‌డినా.. త‌రువాత కుదురుకున్నామ‌ని ఆర్‌సీబీ ఫ్రాంచైజీ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేసిన వీడియోలో కోహ్లి తెలిపాడు. 

“చాలా రోజుల గ్యాప్ త‌రువాత ప్రాక్టీస్ ప్రారంభించ‌డంతో మా ఆట‌గాళ్లు ఇబ్బంది ప‌డ్డారు. వారీ శ‌రీరాలు మొద‌ట స‌హ‌క‌రించ‌లేదు. నిరంత‌రం ప్రాక్టీస్ చేయ‌డంతో ఇప్పుడు కుదురుకున్నారు. మేము స‌రైన ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళ్తున్నాం.ప్రాక్టీస్ కోసం అంద‌రికీ త‌గిన స‌మ‌యాన్ని కేటాయించాం. మిగిలిన సెష‌న్ల‌లో సాధ‌న చేసి ఫాంలోకి వ‌స్తారు. ఆట‌గాళ్లంద‌రూ ఫిట్‌గా ఉన్నారు. మ్యాచ్ జ‌రిగే స‌మ‌యానికి మేము అన్ని విభాగాల్లో సిద్ధ‌మై ఉండాలి.” అని విరాట్ అన్నాడు. 

ఇప్ప‌టివ‌ర‌కు ఐపీఎల్ టైటిల్ సాధించని జ‌ట్ల‌లో ఆర్‌సీబీ కూడా ఉంది. విరాట్ నాయ‌క‌త్వంలో జ‌ట్టులో హేమాహేమీలున్నా.. ఏదో ఒక తప్పిదం వ‌ల్ల వారికి క‌ప్పు అందని ద్రాక్ష‌గా మారింది. ఈసారైనా మెరుగ్గా రాణించి ఆర్‌సీబీ ట్రోఫీ సాధిస్తుందా అనేది వేచి చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo