సోమవారం 30 మార్చి 2020
Sports - Jan 14, 2020 , 00:41:04

సైనా.. నిలబెట్టుకునేనా?

సైనా.. నిలబెట్టుకునేనా?
  • నేటి నుంచి ఇండోనేషియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ

జకర్తా: భారత స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ మరో టోర్నీకి సిద్ధమయ్యారు. మంగళవారం ఇక్కడ ప్రారంభం కానున్న ఇండోనేషియా మాస్టర్స్‌ సూపర్‌-500 టోర్నమెంట్‌లో బరిలోకి దిగనున్నారు. గతేడాది ఇండోనేషియా టోర్నీ విజేతగా నిలిచిన సైనా.. ఈసారి టైటిల్‌ నిలబెట్టుకొని గెలుపుబాట పట్టాలని పట్టుదలగా ఉంది. ఈ ఏడాది తొలి టోర్నీ మలేషియా మాస్టర్స్‌లో సింధు, సైనా క్వార్టర్‌ ఫైనల్లో వెనుదిరిగిన సంగతి తెలిసిందే. కాగా, ఇండోనేషియా టోర్నీలో తొలి రౌండ్‌లో ఐదో సీడ్‌ సింధు.. మలేషియా మాస్టర్స్‌లో రెండో రౌండ్‌లో తన చేతిలో ఓడిన అయా ఓహ్రి (జపాన్‌)తో తలపడనుంది. 


జపాన్‌కే చెందిన సయాకా తకహషితో డిఫెండింగ్‌ చాంపియన్‌ సైనా నెహ్వాల్‌ బుధవారం పోటీ పడనుంది. ఇద్దరూ తొలి రౌండ్‌లో గెలిస్తే.. రెండో రౌండ్‌లో పరస్పరం తలపడనున్నారు. ఇప్పటి వరకు అంతర్జాతీయ టోర్నీల్లో సింధు-సైనా నాలుగుసార్లు మాత్రమే పోటీ పడగా.. సైనానే మూడుసార్లు గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌, సాయిప్రణీత్‌, పారుపల్లి కశ్యప్‌, సమీర్‌ వర్మ పోటీలో ఉండగా.. పరుషుల డబుల్స్‌లో రాంకీరెడ్డి సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జోడీ సత్తాచాటాలని చూస్తున్నది. 


logo