శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Jan 15, 2020 , 00:39:28

లక్ష్యసేన్‌కు మళ్లీ నిరాశే

లక్ష్యసేన్‌కు మళ్లీ నిరాశే

జకర్తా: గతవారం జరిగిన మలేషియా మాస్టర్స్‌ టోర్నీ క్వాలిఫయర్స్‌లోనే వెనుదిరిగిన భారత యువ షట్లర్‌ లక్ష్యసేన్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. ఇండోనేషియా మాస్టర్స్‌ సూపర్‌-500 టోర్నీలోనూ మెయిన్‌ డ్రాకు అర్హత సాధించడంలో అతడు విఫలమయ్యాడు. మంగళవారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వాలిఫయర్స్‌లో లక్ష్య 13-21, 12-21తో తనోంగ్‌సాక్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో పరాజయం పాలయ్యాడు. కాగా, మరో షట్లర్‌ శుభంకర్‌ డే 16-21, 12-21తో థాయ్‌ ప్లేయర్‌ సుపాన్యు అవిహింగ్‌సనాన్‌ చేతిలో ఓడాడు. టోర్నీలో బుధవారం.. భారత స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌, కిడాంబి శ్రీకాంత్‌, సాయిప్రణీత్‌, ప్రణయ్‌, కశ్యప్‌, సమీర్‌ వర్మ మెయిన్‌ ‘డ్రా’ బరిలోకి దిగనున్నారు. 


logo