టోక్యో: పారాలింపిక్స్( Tokyo Paralympics )లో ఇండియన్ అథ్లెట్ వినోద్ కుమార్‌కు షాక్ తగిలింది. డిస్కస్ త్రో ఎఫ్52 క్లాస్‌లో అతడు గెలిచిన బ్రాంజ్ మెడల్‌ను కోల్పోయాడు. టోక్యో పారాలింపిక్స్ టెక్నికల్ కమిటీ అధికారులు.. వినోద్‌ను ఎఫ్52 క్లాస్ డిస్కస్‌కు అనర్హుడిగా తేల్చారు. దీంతో ఈ కాంపిటిషన్లో అతడు సాధించిన ఫలితాన్ని రద్దు చేయడంతో బ్రాంజ్ మెడల్ కోల్పోయాడు.
అసలేంటీ ఎఫ్52 క్లాస్?
పారా అథ్లెట్లను వాళ్ల వైకల్యం రకం, దాని తీవ్రతను బట్టి వర్గీకరిస్తారు. వాళ్ల స్థాయిలోనే వైకల్యం ఉన్న ఇతర అథ్లెట్లతో పోటీ పడేందుకు వీలుగా ఇలా చేస్తారు. డిస్కస్ త్రోలో ఎఫ్52 క్లాస్ అనేది.. బలహీన కండరాల శక్తి, వాటి కదలికల్లో అడ్డంకులు వంటి వాటిని పరిగణనలోకి తీసుకొని వర్గీకరిస్తారు. ఇలాంటి అథ్లెట్లు కూర్చొని పోటీల్లో పాల్గొంటారు. సాధారణంగా వెన్నెముకకు గాయమైన అథ్లెట్లు ఇలాంటి కేటగిరీలో ఉంటారు.