శుక్రవారం 04 డిసెంబర్ 2020
Sports - Oct 22, 2020 , 15:15:05

కోహ్లీసేన‌కు ఆసీస్ ప్ర‌భుత్వం గ్రీన్‌సిగ్న‌ల్‌

కోహ్లీసేన‌కు ఆసీస్ ప్ర‌భుత్వం గ్రీన్‌సిగ్న‌ల్‌

హైద‌రాబాద్‌: ఆస్ట్రేలియాలో ప‌ర్య‌టించ‌నున్న భార‌తీయ క్రికెట్ జ‌ట్టుకు ఆ దేశ ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.  ఈ ఏడాది న‌వంబ‌ర్‌లో భార‌త క్రికెట్ జ‌ట్టు ఆస్ట్రేలియా ప‌ర్య‌టించ‌నున్న‌ది. ప్ర‌స్తుతం దుబాయ్‌లో ఐపీఎల్‌లో ఆడుతున్న భార‌తీయ క్రికెట‌ర్లు అక్క‌డ నుంచే నేరుగా సిడ్నీకి వెళ్ల‌నున్నారు.  సిడ్నీలోనే వాళ్లంతా క్వారెంటైన్ పూర్తి చేసుకుంటారు.  ఈ ప‌ర్య‌ట‌లో ఇండియా నాలుగు టెస్టులు, మూడు వ‌న్డేలు, మూడు టీ20 ఆడ‌నున్న‌ది.  న‌వంబ‌ర్ 27వ తేదీ నుంచి మొద‌ట వ‌న్డే సిరీస్ ప్రారంభంకానున్న‌ది.  అన్ని వ‌న్డే మ్యాచ్‌ల‌ను సిడ్నీలోనే ఆడ‌నున్నారు.  ఆ త‌ర్వాత మూడు టీ20 మ్యాచ్‌ల కోసం క్యాన‌బెరా ప్ర‌యాణిస్తారు. డిసెంబ‌ర్ 17వ తేదీ నుంచి ఆస్ట్రేలియా, ఇండియా మ‌ధ్య తొలి టెస్టు ప్రారంభం అవుతుంది.  అడిలైడ్‌లో ఈ టెస్టు డే అండ్ నైట్ ప‌ద్ధ‌తిలో జ‌ర‌గ‌నున్న‌ది. మెల్‌బోర్న్‌లో బాక్సింగ్ డే టెస్టును నిర్వ‌హించ‌నున్నారు.  సిడ్నీ, బ్రిస్బేన్‌లో మిగితా రెండు టెస్టులు జ‌రుగుతాయి. ఆస్ట్రేలియాలో ప‌ర్య‌టించే భార‌త జ‌ట్టుకు క్వారెంటైన్ ప్రోటోకాల్‌ను న్యూసౌత్ వేల్స్ ప్ర‌భుత్వం ఆమోదించింది. జ‌ట్టు బృందంతో ఆట‌గాళ్ల భార్య‌లు, గ‌ర్ల్‌ఫ్రెండ్ల‌ను అనుమ‌తించ‌డం లేదు. న‌వంబ‌ర్ 10వ తేదీన ఐపీఎల్ ఫైన‌ల్ ముగిసిన త‌ర్వాత‌.. ఎంపికైన భార‌త ఆట‌గాళ్లు నేరుగా ఆస్ట్రేలియా వెళ్తారు.