శుక్రవారం 03 జూలై 2020
Sports - May 05, 2020 , 21:36:29

ఏ జ‌ట్టుకైనా పోటీ ఇవ్వ‌గ‌ల‌దు: ర‌విశాస్త్రి

ఏ జ‌ట్టుకైనా పోటీ ఇవ్వ‌గ‌ల‌దు: ర‌విశాస్త్రి

న్యూఢిల్లీ: 1985లోని భార‌త జ‌ట్టు ప్ర‌స్తుత టీమ్ఇండియాకు పోటీనివ్వ‌గ‌ల‌ద‌ని భార‌త హెడ్‌కోచ్ ర‌విశాస్త్రి అభిప్రాయ‌ప‌డ్డాడు. ఆ జ‌ట్టులో అనుభ‌వ‌జ్ఞులు, యువ‌కులు స‌రి స‌మానంగా ఉండేవార‌ని.. ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో ఆ జ‌ట్టు ప్ర‌పంచంలోనే ఏ జ‌ట్టునైనా ఓడించ‌గ‌లద‌ని శాస్త్రి విశ్వాసం వ్య‌క్తం చేశాడు. ప్ర‌స్తుతం విరాట్ కోహ్లీ సేన‌కు ప్ర‌ధాన కోచ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ర‌విశాస్త్రి 1985 జ‌ట్టులో ఆల్‌రౌండ‌ర్‌గా సేవ‌లందించిన విష‌యం తెలిసిందే.

`నా వ‌ర‌కైతే 1983 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన జ‌ట్టుక‌న్నా.. 1985 టీమ్ చాలా స్ట్రాంగ్‌గా ఉండేది. అందులో అనుభ‌వ‌జ్ఞుల‌తో పాటు యువ‌కులు కూడా ఉన్నారు. ఆ రెండు జ‌ట్ల‌లో నేను భాగ‌స్వామినే. అందుకే ఈ మాట‌లు అంటున్నా. సునీల్ గ‌వాస్క‌ర్ నేతృత్వంలో వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌షిప్ ఆఫ్ క్రికెట్ నెగ్గిన జ‌ట్టు.. ప్ర‌స్తుతం విరాట్ అండ్ గ్యాంగ్‌కు కూడా  పోటీనివ్వ‌గ‌ల‌దు` అని ర‌విశాస్త్రి చెప్పుకొచ్చాడు. ఆ చాంపియ‌న్‌షిప్‌లో మ్యాన్ ఆఫ్ ది టోర్న‌మెంట్‌గా నిలిచినందుకు గాను ర‌విశాస్త్రి ఆడీ కార్‌ను బ‌హుమ‌తిగా పొందిన విష‌యం తెలిసిందే.


logo