శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Mar 13, 2020 , 18:36:34

భారత్‌-సౌతాఫ్రికా వన్డే సిరీస్‌ రద్దు..

భారత్‌-సౌతాఫ్రికా వన్డే సిరీస్‌ రద్దు..

ముంబై:  ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి కారణంగా అభిమానులు మరికొన్ని రోజులు భారత్‌లో క్రికెట్‌ మ్యాచ్‌లు చూసే అవకాశాన్ని కోల్పోనున్నారు.  కరోనా వైరస్‌ భయపెడుతున్న నేపథ్యంలో భారత్‌-సౌతాఫ్రికా వన్డే సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లను కూడా రద్దు  చేశారు. ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా.. మార్చి 15న లక్నో, 18న కోల్‌కతాలో తర్వాతి రెండు వన్డేలను ఖాళీ స్టేడియాల్లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఆటగాళ్లు, ప్రేక్షకుల క్షేమం కోసం బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. 

కాసుల వర్షం  కురిపించే ఐపీఎల్‌ను బీసీసీఐ ఇప్పటికే ఏప్రిల్‌ 15కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఆటలను చూసేందుకు ప్రేక్షకులను అనుమతించొద్దని క్రీడా మంత్రిత్వశాఖ ఆదేశించడంతో.. కనీసం ఖాళీ స్టేడియాల్లో ఆఖరి రెండు మ్యాచ్‌లను నిర్వహించాలని బీసీసీఐ భావించినప్పటికీ సాధ్యం కాలేదు. ఇప్పటికే ఇంగ్లాండ్‌ పర్యటనను శ్రీలంక రద్దు చేసుకుంది. రెండు టెస్టుల సిరీస్‌ను విరమించుకొని.. లంక ఆటగాళ్లు వెంటనే స్వదేశానికి రావాలని  లంక బోర్డు ఆదేశించింది. 


logo