బుధవారం 03 జూన్ 2020
Sports - Apr 10, 2020 , 19:25:08

భార‌త్‌, న్యూజిలాండ్ ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ పోరు ర‌ద్దు

భార‌త్‌, న్యూజిలాండ్ ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ పోరు ర‌ద్దు

న్యూఢిల్లీ: ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్‌లో భాగంగా వ‌చ్చే నెల‌లో భార‌త్‌, న్యూజిలాండ్ మ‌ధ్య జ‌ర‌గాల్సిన టై ర‌ద్దైంది. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కోర‌లు చాస్తున్న నేప‌థ్యంలో.. అంత‌ర్జాతీయ రాక‌పోక‌లు స్తంభించడంతో న్యూజిలాండ్ ఈ నిర్ణ‌యం తీసుకుంది. షెడ్యూల్ ప్ర‌కారం వ‌చ్చే నెల 23, 24న భువ‌నేశ్వ‌ర్ వేదిక‌గా భార‌త్‌, న్యూజిలాండ్ రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండ‌గా.. న్యూజిలాండ్ ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు ఈ పోరును ర‌ద్దు చేసుకుంది.

`ప్ర‌భుత్వ సూచ‌న‌ల మేర‌కు అంత‌ర్జాతీయ ప్ర‌యాణాలు ర‌ద్దు కావ‌డంతో.. ఈ నిర్ణ‌యం తీసుకున్నాం. ఆట‌గాళ్లు, అద‌న‌పు సిబ్బంది ఆరోగ్యాల‌ను దృష్టిలో ఉంచుకొని హాకీ న్యూజిలాండ్ (హెచ్ఎన్‌జ‌డ్‌) ఈ  నిర్ణ‌యానికి వ‌చ్చింది. దీంతో భార‌త్‌లో ప‌ర్య‌టించాల్సిన పురుషుల జ‌ట్టు, చైనాలో ప‌ర్య‌టించాల్సిన మ‌హిళ‌ల జ‌ట్లు.. త‌మ మ్యాచ్‌ల‌ను ర‌ద్దు చేసుకున్నాయి.` అని హెచ్ఎన్‌జ‌డ్ చీఫ్ ఇయాన్ ఫ్రాన్సిస్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. 


logo