గురువారం 09 ఏప్రిల్ 2020
Sports - Feb 05, 2020 , 09:19:29

IND vs NZ: ఒకేసారి ఇద్దరు ఓపెనర్లు అరంగేట్రం

IND vs NZ: ఒకేసారి ఇద్దరు ఓపెనర్లు అరంగేట్రం

న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో భారత ఓపెనర్లు పృథ్వీ షా, మయాంక్‌ అగర్వాల్‌ అరుదైన రికార్డు నమోదు చేశారు.

హామిల్టన్‌:  ఆతిథ్య కివీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డే బుధవారం హామిల్టన్‌ వేదికగా ఆరంభమైంది. టాస్‌ ఓడిన టీమ్‌ఇండియా మొదట బ్యాటింగ్‌ చేస్తున్నది. న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో భారత ఓపెనర్లు పృథ్వీ షా, మయాంక్‌ అగర్వాల్‌ అరుదైన రికార్డు నమోదు చేశారు. భారత్‌ తరఫున  ఇద్దరు ఓపెనర్లు షా, మయాంక్‌ ఒకేసారి వన్డేల్లో అరంగేట్రం చేశారు. ఒకే మ్యాచ్‌లో ఇద్దరు ఓపెనర్లు అరంగేట్రం చేయనుండటం భారత్‌ క్రికెట్‌ చరిత్రలో ఇది నాలుగోసారి కావడం విశేషం.

గతంలో రాహుల్‌, కరుణ్‌ నాయర్‌ (2016లో జింబాబ్వేపై).. సునీల్‌ గవాస్కర్‌, సుధీర్‌ నాయక్‌ (1974లో ఇంగ్లండ్‌పై).. పార్థసారథి శర్మ, దిలీప్‌ వెంగ్‌సర్కార్‌  (1976లో న్యూజిలాండ్‌పై) అరంగేట్రం మ్యాచ్‌ల్లో ఓపెనింగ్‌ చేశారు. సీనియర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ గాయాలతో కివీస్‌ టూర్‌ నుంచి వైదొలగడంతో షా, మయాంక్‌లను టీమ్‌ఇండియా కొత్త ఓపెనర్లుగా బరిలో దింపింది.  క్రీజులో కుదురుకున్న షా(20), మయాంక్‌ అగర్వాల్‌(32) స్వల్ప వ్యవధిలోనే వెనుదిరిగారు. logo