సోమవారం 06 ఏప్రిల్ 2020
Sports - Mar 03, 2020 , 00:54:57

కాంస్యాలు

కాంస్యాలు

న్యూఢిల్లీ: భారత యువ షట్లర్లు తస్నీమ్‌ మీర్‌, మాన్సి సింగ్‌ అంతర్జాతీయ టోర్నీలో సత్తాచాటారు. నెదర్లాండ్స్‌ వేదికగా జరిగిన డచ్‌ జూనియర్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీలో కాంస్య పతకాలు సాధించారు. బీడబ్ల్యూఎఫ్‌ గ్రాండ్‌ ప్రి టోర్నమెంట్‌ బాలికల సింగిల్స్‌లో భారత ప్లేయర్లు రెండు కాంస్యాలు సాధించడం ఇదే తొలిసారి. సోమవారం జరిగిన సెమీఫైనల్లో తస్నీమ్‌ 19-21, 10-22తో మూడో సీడ్‌ సో యుల్‌ లీ (కొరియా) చేతిలో ఓడగా.. మాన్సి 11-21, 16-21తో సైఫీ రిజ్కా (ఇండోనేషియా) చేతిలో పరాజయం పాలైంది.  మరోవైపు కెన్యా ఇంటర్నేషనల్‌ టోర్నీలో భారత వర్ధమాన ప్లేయర్లు ఆకర్షి, అనుపమా వరుసగా స్వర్ణ, రజత పతకాలు సాధించారు.
logo