మంగళవారం 31 మార్చి 2020
Sports - Jan 20, 2020 , 02:40:43

దహియాకు స్వర్ణం

దహియాకు స్వర్ణం

రోమ్‌: రోమ్‌ ర్యాం కింగ్‌ సిరీస్‌ రెజ్లింగ్‌ టోర్నమెంట్‌లో భార త రెజ్లర్లు ఏడు పతకాలు చేజిక్కించుకొని సత్తాచాటారు. శనివా రం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల 61 కేజీల ఫైనల్లో భారత యువ రెజ్లర్‌ రవి కుమార్‌ దహియా 12-2తో నూర్‌బొలాట్‌ అబ్దులియేవ్‌ (కజకిస్థాన్‌)ను మట్టికరిపించి విజేతగా నిలిచాడు. మొన్నటి వరకు 57 కేజీల విభాగంలో పోటీపడిన రవి.. కొత్తగా 61 కేజీల పోరులో బరిలోకి దిగి కూడా అదుర్స్‌ అనిపించాడు. ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టిస్తూ ఏకపక్ష విజయం సాధించాడు. అంతకుముందు బజరంగ్‌ పునియా (65 కేజీలు) గురప్రీత్‌ సింగ్‌ (82 కేజీలు) పురుషుల విభాగంలో స్వర్ణాలు సాధిస్తే.. మహిళల విభాగంలో వినేశ్‌ ఫొగట్‌ (53కేజీలు) పసిడి సొంతం చేసుకుంది. అన్షు మాలిక్‌ (57 కేజీలు), సునీల్‌ కుమార్‌ (97 కేజీలు) రజతాలు నెగ్గగా.. సజన్‌ భన్వాల్‌ (77 కేజీలు) కాంస్యం దక్కించుకున్నాడు.


logo
>>>>>>