సోమవారం 13 జూలై 2020
Sports - Apr 24, 2020 , 16:55:35

మహిళల క్రికెట్‌ జట్టు ఇంగ్లండ్‌ టూర్‌ వాయిదా

మహిళల క్రికెట్‌ జట్టు ఇంగ్లండ్‌ టూర్‌ వాయిదా

హైదరాబాద్‌: వచ్చే నెల జరగాల్సిన భారత మహిళల జట్టు ఇంగ్లండ్‌ టూర్‌ తాత్కాలికంగా వాయిదా పడింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో జూలై 1 వరకు దేశంలో అన్ని రకాల క్రికెట్‌ మ్యాచ్‌లను ఇంగ్లండ్‌ రద్దు చేయడంతో టోర్నీ వాయిదా తప్పనిసరయ్యింది. షెడ్యూల్‌ ప్రకారం  జూలై 25 నుంచి జూన్‌ 9 వరకు భారత మహిళల జట్టు నాలుగు వన్డే మ్యాచ్‌లు, రెండు టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నది. 

టౌంటన్‌, బ్రిస్టల్‌లో రెండు టీ 20 మ్యాచ్‌లు, నాలుగు వన్డే మ్యాచులు వర్సెస్టర్‌, చేమ్స్‌ఫోర్డ్‌, కాంటర్బరీ, హోవ్‌లలో నాలుగు వన్డే మ్యాచ్‌లు జరగాల్సి ఉంది.  


logo