మంగళవారం 31 మార్చి 2020
Sports - Feb 04, 2020 , 23:56:59

భారత అమ్మాయిల గెలుపు

భారత అమ్మాయిల గెలుపు

ఆక్లాండ్‌: కెప్టెన్‌ రాణి రాంపాల్‌ సూపర్‌ గోల్‌తో మెరువడంతో ముక్కోణపు టోర్నీలో భారత మహిళల హాకీ జట్టు విజయం సాధించింది. మంగళవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 1-0తో గ్రేట్‌ బ్రిటన్‌ను చిత్తు చేసింది. భారత జట్టు తరఫున కెప్టెన్‌ రాణి రాంపాల్‌ (47వ నిమిషంలో) ఏకైక గోల్‌ చేసింది. మ్యాచ్‌ ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా పోరాడగా.. తొలి అర్ధభాగంలో ఒక్క గోల్‌ కూడా నమోదు కాలేదు. భారత్‌కు రెండు పెనాల్టీ కార్నర్‌ అవకాశాలు వచ్చినా వాటిని వినియోగించుకోలేకపోయింది. ఎట్టకేలకు చివరి క్వార్టర్‌లో రాణి గోల్‌తో భారత్‌ ఖాతా తెరిచింది. ఆ తర్వాత ప్రత్యర్థి ఎంత ప్రయత్నించినా స్కోరు సమం చేయలేకపోవడంతో భారత్‌ గెలుపు ఖాయమైంది.


logo
>>>>>>