సోమవారం 30 మార్చి 2020
Sports - Jan 28, 2020 , 02:51:58

అమ్మాయిల ఓటమి

అమ్మాయిల ఓటమి

ఆక్లాండ్‌: విజయంతో కివీస్‌ టూర్‌ను ప్రారంభించిన భారత మహిళల హాకీ జట్టు రెండో మ్యాచ్‌లో ఆ జోరు కొనసాగించలేకపోయింది. సోమవారం జరిగిన పోరులో రాణి రాంపాల్‌ బృందం 1-2తో న్యూజిలాండ్‌ అమ్మాయిల చేతిలో ఓటమి పాలైంది. భారత్‌ తరఫున సలీమ ఏకైక గోల్‌ చేయగా.. న్యూజిలాండ్‌ తరఫున మెగన్‌ హల్‌ డబుల్‌ గోల్స్‌తో మెరిసింది. గత మ్యాచ్‌లో పరాజయంతో కసి మీదున్న కివీస్‌ ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగింది.


logo