శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Feb 03, 2020 , 02:16:50

భారత మహిళల ఓటమి

 భారత మహిళల ఓటమి

కాన్‌బెర్రా: ముక్కోణపు టీ20 టోర్నీలో తొలి మ్యాచ్‌ నెగ్గి జోరు కనబరిచిన భారత మహిళల జట్టు రెండో మ్యాచ్‌లో ఓడింది. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బృందం 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. సమిష్ఠి వైఫల్యంతో మొద ట బ్యాటింగ్‌ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 103 పరుగులు చేసింది. స్మృతి మంధన (35; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (28; 4 ఫోర్లు) మినహా తక్కినవారంతా విఫలమయ్యారు. అనంతరం బ్యా టింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 18.5 ఓవర్లలో 6 వికెట్లకు 104 పరుగులు చేసి గెలిచింది. 


logo