శనివారం 28 నవంబర్ 2020
Sports - Oct 23, 2020 , 01:56:03

దుబాయ్‌ చేరుకున్న భారత మహిళా క్రికెటర్లు

దుబాయ్‌ చేరుకున్న భారత మహిళా క్రికెటర్లు

దుబాయ్‌: మహిళల ఐపీఎల్‌(టీ20 చాలెంజ్‌) కోసం భారత ప్లేయర్లు యూఏఈలో అడుగుపెట్టారు. స్టార్లు మిథాలీ రాజ్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, స్మృతి మందన సహా మొత్తం 30మంది ప్రత్యేక విమానంలో గురువారం దుబాయ్‌కి  చేరుకున్నారు. ఆరు రోజుల క్వారంటైన్‌ తర్వాత అందరూ బయో బబుల్‌లోకి వెళ్లనున్నారు. నవంబర్‌ 4 నుంచి 9వ తేదీ వరకు షార్జాలో మహిళల టీ20 చాలెంజ్‌ జరుగనుంది.  సూపర్‌ నోవాస్‌ జట్టుకు హర్మన్‌ప్రీత్‌, ట్రైల్‌బ్లేజర్స్‌కు మందన, వెలాసిటీ టీమ్‌కు మిథాలీ రాజ్‌ సారథ్యం వహించనున్నారు.