బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Mar 04, 2020 , 23:51:00

క్వార్టర్స్‌లో సాక్షి, సిమ్రన్‌

క్వార్టర్స్‌లో సాక్షి, సిమ్రన్‌

అమన్‌ (జోర్డాన్‌): ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌లో భారత మహిళా బాక్సర్లు సాక్షి చౌదరి (57 కేజీలు), సిమ్రన్‌జిత్‌ కౌర్‌ (60 కేజీలు) క్వార్టర్‌ ఫైనల్లో అడుగుపెట్టి.. ఒలింపిక్స్‌ అర్హతకు ఒక్కఅడుగు దూరంలో నిలిచారు. బుధవారం ఇక్కడ జరిగిన బౌట్లలో జూనియర్‌ ప్రపంచ చాంపియన్‌ సాక్షి 4-1తేడాతో నాలుగో సీడ్‌ నిలావన్‌ టెకాసుప్‌ (థాయ్‌లాండ్‌)ను చిత్తుచేయగా.. సిమ్రన్‌జిత్‌ 5-0తో రిమా వోలోసెంకో (కజకిస్థాన్‌)ను ఓడించింది.  ఇరువురికి తొలి రౌండ్‌లో బై లభించగా.. రెండో రౌండ్‌ బౌట్‌లో సాక్షి, టెకాసుప్‌ హోరాహోరీగా తలపడ్డారు. థాయ్‌ ప్లేయర్‌ ఓ దశలో దూకుడుగా ఆడడంతో కాసేపు వెనుకబడినా చివరి మూడు నిమిషాల్లో భారత బాక్సర్‌ సత్తాచాటి, గెలుపు సొంతం చేసుకుంది. క్వార్టర్స్‌లో ఇమ్‌ ఎజీ (కొరియా)తో సాక్షి, రెండో సీడ్‌ నుమున్‌ (మంగోలియా)తో సిమ్రన్‌ తలపడనున్నారు. ఈ బౌట్లలో గెలిచి సెమీస్‌ చేరితే టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌ ఖారరవుతుంది. 


logo