శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Feb 18, 2020 , 23:57:06

ప్రిక్వార్టర్స్‌లో సానియా జోడీ

ప్రిక్వార్టర్స్‌లో సానియా జోడీ

 దుబాయ్‌: గాయం నుంచి కోలుకున్న భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా దుబాయ్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌ను విజయంతో ప్రారంభించింది. మంగళవారం జరిగిన మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సానియా - కరోలిన్‌ గ్రేసియా (ఫ్రాన్స్‌) జోడీ 6-4, 4-6, 10-8తేడాతో కుడ్రవత్సేవ (రష్యా)-స్రెబోట్నిక్‌ (స్లోవేనియా) ద్యయంపై విజయం సాధించింది. ప్రిక్వార్టర్స్‌లో సానియా జోడీ.. ఐదో సీడ్‌ సైసై జెంగ్‌ (చైనా) - బార్బోరా క్రెజ్‌సికోవా (చెక్‌ రిపబ్లిక్‌)తో తలపడనుంది. 


logo