e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home News టీమిండియా మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌.. ఎప్పుడు? ఎక్క‌డ‌?

టీమిండియా మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌.. ఎప్పుడు? ఎక్క‌డ‌?

టీమిండియా మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌.. ఎప్పుడు? ఎక్క‌డ‌?

డ‌ర్హమ్‌: ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియా మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడ‌నుంది. డ‌ర్హ‌మ్‌లో జ‌ర‌గ‌నున్న ఈ మ్యాచ్‌లో కౌంటీ చాంపియ‌న్‌షిప్ లెవ‌న్‌తో కోహ్లి సేన త‌ల‌ప‌డ‌నుంది. ఈ నెల 20న ఈ మ్యాచ్ ప్రారంభం కానున్న‌ట్లు డ‌ర్హ‌మ్ క్రికెట్ తెలిపింది. డ‌ర్హ‌మ్‌లోని ఎమిరేట్స్ రివ‌ర్‌సైడ్‌లో ఈ మ్యాచ్ జ‌రుగుతుంది. డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ త‌ర్వాత మూడు వారాల పాటు బ‌యో బబుల్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన ఇండియ‌న్ క్రికెట‌ర్లు గురువారం డ‌ర్హ‌మ్ వెళ్తున్నారు. ఒక క్రికెట‌ర్‌కు పాజిటివ్‌గా తేల‌డంతో అత‌న్ని వ‌దిలేసి మిగతా టీమంతా ఈ మూడు రోజుల మ్యాచ్ కోసం వెళ్తోంది.

ఇంగ్లండ్ సిరీస్‌కు ముందు ఇండియ‌న్ టీమ్ ఆడ‌నున్న ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్ ఇదే. ఈ మ్యాచ్‌కు ప్రేక్ష‌కులెవ‌రినీ అనుమ‌తించ‌డం లేదు. తొలి టెస్ట్ ఆగ‌స్ట్ 4 నుంచి ట్రెంట్ బ్రిడ్జ్‌లో జ‌ర‌గ‌నుంది. అప్ప‌టి వ‌ర‌కూ టీమ్ ఎమిరేట్స్ గ్రౌండ్‌లోనే ప్రాక్టీస్ చేయ‌నుంది. ఈ మ్యాచ్‌ను డ‌ర్హ‌మ్ క్రికెట్ యూట్యూబ్ చానెల్‌లో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నున్న‌ట్లు అక్క‌డి బోర్డు తెలిపింది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
టీమిండియా మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌.. ఎప్పుడు? ఎక్క‌డ‌?
టీమిండియా మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌.. ఎప్పుడు? ఎక్క‌డ‌?
టీమిండియా మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌.. ఎప్పుడు? ఎక్క‌డ‌?

ట్రెండింగ్‌

Advertisement