సోమవారం 25 జనవరి 2021
Sports - Dec 11, 2020 , 13:18:19

పింక్ బాల్‌తో చేతులెత్తేసిన టీమిండియా.. 194 ఆలౌట్‌

పింక్ బాల్‌తో చేతులెత్తేసిన టీమిండియా.. 194 ఆలౌట్‌

సిడ్నీ: ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై తొలి పింక్ బాల్ ప‌రీక్ష‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ విఫ‌ల‌మ‌య్యారు. ఆస్ట్రేలియా ఎతో జ‌రుగుతున్న 3 రోజుల డేనైట్ ప్రాక్టీస్‌ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 194 ప‌రుగుల‌కే ఆలౌటైంది. ఒక ద‌శ‌లో 123 ప‌రుగుల‌కే 9 వికెట్లు కోల్పోగా.. చివ‌రి వికెట్‌కు బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా, మ‌హ్మ‌ద్ సిరాజ్ 71 ప‌రుగులు జోడించ‌డం విశేషం. ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో తొలి హాఫ్ సెంచ‌రీ చేసిన బుమ్రా.. ఆసీస్ బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగ‌డంతో ఈ మాత్రం స్కోరైనా చేయ‌గ‌లిగింది ఇండియ‌న్ టీమ్‌. చివ‌రికి బుమ్రా 55 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిల‌వ‌గా.. సిరాజ్ 22 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. అంత‌కుముందు ఆస్ట్రేలియా ఎ బౌల‌ర్ల ధాటికి మిడిలార్డ‌ర్ చేతులెత్తేసింది. ఓపెన‌ర్ పృథ్వి షా (40), శుభ్‌మ‌న్ గిల్ (43) మిన‌హాయించి.. మిగ‌తా బ్యాట్స్‌మెన్ అంతా విఫ‌ల‌మ‌య్యారు. మ‌యాంక్ అగ‌ర్వాల్ (2), హ‌నుమ విహారి (15), అజింక్య ర‌హానే (4), రిష‌బ్ పంత్ (5), వృద్ధిమాన్ సాహా (0) త‌క్కువ స్కోర్ల‌కే ఔట‌య్యారు. ఆస్ట్రేలియా ఎ బౌల‌ర్ల‌లో సీన్ అబాట్‌, జాక్ వైల్డ‌ర్‌మూత్ చెరో 3 వికెట్లు తీశారు. 


logo