ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Sports - Jan 26, 2021 , 19:01:08

భారత ఆటగాళ్లకు ముందు కరోనా టెస్టు.. ఆ తర్వాతే హోటల్‌కు!

భారత ఆటగాళ్లకు ముందు కరోనా టెస్టు.. ఆ తర్వాతే హోటల్‌కు!

ముంబై: చెన్నైలోని టీమ్‌ హోటల్‌లోకి వెళ్లేముందు భారత ఆటగాళ్లు తప్పనిసరిగా కొవిడ్‌-19 పరీక్ష చేయించుకోవాలని బీసీసీఐ కోరింది. కరోనా నెగెటివ్‌ ఫలితంతోనే ఆటగాళ్లు కొత్తగా ఏర్పాటు చేసిన బయో బబుల్‌లోకి ప్రవేశించాలని టీమ్‌ డాక్టర్‌ అభిజిత్‌ సాల్వి సూచించారు. కొవిడ్‌ ఫార్మాలిటీలను ఆటగాళ్లు జనవరి 27 ఉదయం వరకు పూర్తి చేసుకోవాలని చెప్పారు. 

ఈనెల 26వ తేదీ రాత్రి లేదా 27న ఉదయం లోపు హోటల్‌లో ఉండమని మాకు చెప్పారని టీమ్‌ఇండియా సభ్యుడొకరు చెప్పారు.  బీసీసీఐ  కొవిడ్‌కు సంబంధించిన సూచనలు చేసిందని ధ్రువీకరించాడు.   ఆస్ట్రేలియా పర్యటనలో బయో బబుల్‌లో గడిపిన  టీమ్‌ఇండియా స్వదేశానికి రాగానే గృహ నిర్బంధంలో ఉండాలని బీసీసీఐ ఆదేశించింది.   భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య తొలి టెస్టు చెన్నై వేదికగా ఫిబ్రవరి 5 నుంచి మొదలవనుంది. 

VIDEOS

logo