సోమవారం 25 జనవరి 2021
Sports - Dec 11, 2020 , 18:19:51

పింక్ బాల్‌తో చెల‌రేగిన బౌల‌ర్లు.. ఇండియాకు 86 ర‌న్స్ లీడ్‌

పింక్ బాల్‌తో చెల‌రేగిన బౌల‌ర్లు.. ఇండియాకు 86 ర‌న్స్ లీడ్‌

సిడ్నీ: బ‌్యాట్స్‌మెన్ విఫ‌ల‌మైనా.. పింక్ బాల్‌తో బౌల‌ర్లు చెల‌రేగ‌డంతో ఆస్ట్రేలియా ఎతో జ‌రుగుతున్న మూడు రోజుల మ్యాచ్‌లో ప‌ట్టుబిగించింది టీమిండియా. బౌల‌ర్ల ఆధిప‌త్యం న‌డిచిన తొలి రోజు ఆట‌లో మొత్తం 20 వికెట్లు నేల‌కూల‌డం విశేషం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియ‌న్ టీమ్ 194 ప‌రుగుల‌కే ఆలౌట్ కాగా.. త‌ర్వాత ఆస్ట్రేలియా ఎ టీమ్‌ను 108 ప‌రుగుల‌కే కుప్ప‌కూల్చింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 86 ప‌రుగుల ఆధిక్యం సంపాదించింది. మ‌రో రెండు రోజుల ఆట మిగిలి ఉండ‌టంతో ఈ మ్యాచ్‌లో ఫ‌లితం తేలే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. స్టార్ బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా ఇటు బ్యాట్‌తోనూ, అటు బాల్‌తోనూ రాణించాడు. ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌లో తొలి హాఫ్ సెంచ‌రీ చేసిన బుమ్రా.. 55 ప‌రుగుల‌తో ఇండియ‌న్ టీమ్‌లో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. త‌ర్వాత బౌలింగ్‌లోనూ 2 వికెట్లు తీశాడు. 3 వికెట్లు ప‌డ‌గొట్టిన మ‌హ్మ‌ద్ ష‌మికి మంచి స‌పోర్ట్ ఇవ్వ‌డంతో ఆస్ట్రేలియా ఎ బ్యాట్స్‌మెన్ కిందా మీదా ప‌డ్డారు. సాధార‌ణ బంతితో పోలిస్తే ఫ్ల‌డ్‌లైట్ల వెలుతురులో పింక్ బాల్ కాస్త ఎక్కువ‌గానే స్వింగ్ అవ‌డంతో రెండు జ‌ట్ల బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది ప‌డ్డారు. అంత‌కుముందు టీమిండియా కూడా 123 ప‌రుగుల‌కే 9 వికెట్లు కోల్పోయినా.. చివరి వికెట్‌కు సిరాజ్ (22)తో క‌లిసి 71 ప‌రుగులు జోడించాడు బుమ్రా. ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో ఈ నెల 17న జ‌ర‌గ‌బోయే తొలి టెస్ట్ డేనైట్‌దే కావ‌డంతో ఈ మ్యాచ్‌తో టీమిండియా గ‌ట్టి సందేశాన్నే పంపించింది. 


logo