శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Sports - Jan 18, 2021 , 00:58:31

పూర్వవైభవం దిశగా భారత హాకీ: సౌందర్య

పూర్వవైభవం దిశగా భారత హాకీ: సౌందర్య

కొత్తపల్లి (కరీంనగర్‌), జనవరి 17: పూర్వవైభవం దిశగా భారత హాకీ పయనిస్తున్నదని భారత మహిళల హాకీ జట్టు మాజీ వైస్‌ కెప్టెన్‌ యెండల సౌందర్య పేర్కొన్నారు. గురుగోవింద్‌సింగ్‌ మహిళా హాకీ పోటీల సందర్భంగా కరీంనగర్‌కు వచ్చిన సౌందర్య ఆదివారం ‘నమస్తే తెలంగాణ’తో ముచ్చటించారు. అంతర్జాతీయ ర్యాంకింగ్‌లో భారత్‌ తొమ్మిది నుంచి నాలుగో స్థానానికి చేరడం శుభపరిణామమన్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో మన్‌ప్రీత్‌సింగ్‌ నాయకత్వంలోని భారత జట్టు ఈ సారి ఒలింపిక్‌ పతకాన్ని సాధిస్తుందని ఆమె ఆశాభావం వ్యకం చేశారు. స్వరాష్ట్రం సిద్ధించాక తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధి, క్రీడాకారుల సంక్షేమానికి విశేష ప్రాధాన్యతనిస్తున్నదని సౌందర్య పేర్కొన్నారు. 

VIDEOS

logo