శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Sports - Jan 19, 2020 , 01:01:08

భారత్‌ బోణీ

భారత్‌ బోణీ

భువనేశ్వర్‌: టోక్యో ఒలింపిక్స్‌ సన్నాహాల్లో భాగంగా ఎఫ్‌ఐహెచ్‌ ప్రో లీగ్‌లో భారత హాకీ జట్టు ఆదరగొట్టింది. శనివారం ప్రపంచ నంబర్‌వన్‌ నెదర్లాండ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 5-2తో అద్భుత విజయం సాధించింది. రూపిందర్‌పాల్‌ సింగ్‌(12ని, 46ని) డబుల్‌ గోల్స్‌ చేయగా, గుర్జాంత్‌సింగ్‌(1ని), మన్‌దీప్‌సింగ్‌(34ని), లలిత్‌ ఉపాధ్యాయ్‌(36ని) ఒక్కో గోల్‌ చేశారు. డచ్‌ జట్టులో జిప్‌ జాన్సెన్‌(14ని), జెరోన్‌ హెర్ట్‌బెర్గర్‌(28ని) తలో గోల్‌ కొట్టారు. 


logo