గురువారం 01 అక్టోబర్ 2020
Sports - Aug 17, 2020 , 23:50:25

కోలుకున్నహాకీ ఆటగాళ్లు

కోలుకున్నహాకీ ఆటగాళ్లు

న్యూఢిల్లీ: కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ సహా భారత పురుషుల హాకీ జట్టుకు చెందిన ఆరుగురు ఆటగాళ్లు కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఈ నెల 10, 12వ తేదీ మధ్య మన్‌ప్రీత్‌, డిఫెండర్‌ సురేందర్‌ కుమార్‌, జస్‌కరణ్‌ సింగ్‌, వరుణ్‌ కుమార్‌, గోల్‌కీపర్‌ కృష్ణన్‌ బహదూర్‌, స్ట్రైకర్‌ మన్‌దీప్‌ సింగ్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అయితే తాజాగా నిర్వహించిన రెండు కరోనా పరీక్షల్లో వీరందరికీ నెగిటివ్‌ వచ్చింది. దీంతో దవాఖన నుంచి వీరిని రిశ్చార్జ్‌ చేశారు.  బుధవారం నుంచి బెంగళూరులోని సాయ్‌ కేంద్రంలో పురుషుల, మహిళల జట్లకు శిక్షణ శిబిరం ప్రారంభం కానుంది. ప్రస్తుతం 34మంది పురుష, 24మంది మహిళా ప్లేయర్లు సాయ్‌ కేంద్రంలో ఉన్నారు.  కాగా ప్రపంచ మాజీ బాక్సింగ్‌ చాంపియన్‌ సరితాదేవి కరోనా వైరస్‌ బారిన పడింది. 


logo