గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Feb 17, 2020 , 00:20:20

హంపి జోరు

 హంపి జోరు

సెయింట్‌ లూయిస్‌ (అమెరికా): కెయిన్స్‌ కప్‌ చెస్‌ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి దూసుకెళుతున్నది. ఆదివారం జరిగిన ఎనిమిదో రౌండ్‌ లో వెలెటినా గునియా (రష్యా)ను ఓడించిన హంపి ఓవరాల్‌గా 5.5 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. 35 ఎత్తుల్లోనే ప్రత్యర్థిని చిత్తుచేసిన హంపి నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకున్నది. భారత మరో గ్రాండ్‌ మాస్టర్‌ ద్రోణవల్లి హారిక... మాజీ ప్రపంచ చాంపియన్‌ మాకియా ముజిచుక్‌ (ఉక్రెయిన్‌)తో గేమ్‌ను ‘డ్రా’ చేసుకుంది. వరుసగా మూడు రౌండ్లను సమం చేసుకున్న హారిక 4 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నది. కాగా, తొమ్మిదోదైన చివరి రౌండ్‌లో హారికతో  హంపి అమీతుమీ తేల్చుకోనుంది. ఈ గేమ్‌లో సత్తాచాటితే హంపికి టైటిల్‌ చేజిక్కే అవకాశాలు అధికంగా ఉన్నాయి.


logo
>>>>>>