సోమవారం 28 సెప్టెంబర్ 2020
Sports - Aug 26, 2020 , 18:01:03

మెస్సీ కోసం రేసులో భారత ఫుట్‌బాల్‌ క్లబ్‌లు?

మెస్సీ కోసం రేసులో భారత ఫుట్‌బాల్‌ క్లబ్‌లు?

న్యూఢిల్లీ:  రెండు దశాబ్దాల పాటు బార్సిలోనా క్లబ్‌కు ఆడిన  అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌  లియోనల్ మెస్సీ ఆ జట్టును వీడుతున్నట్లు ప్రకటించిన విషయం  తెలిసిందే. మెస్సీ టీమ్‌ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న  విషయాన్ని క్లబ్‌ కూడా ధ్రువీకరించింది. తన కెరీర్‌ మొత్తాన్ని బార్సిలోనాలో గడిపిన మెస్సీ ఇక జట్టును వీడాలనుకుంటున్నాడని అతని లాయర్‌ కూడా వెల్లడించారు. తమ జట్టులో మెస్సీ ఉండాలని, క్లబ్‌లోనే తన కెరీర్‌ ముగించాలని తాము కోరుకుంటున్నట్లు  క్లబ్‌ యాజమాన్యం అతనికి బ్యూరోఫాక్స్‌ ద్వారా తెలియజేసింది.

ఫుట్‌బాల్‌ దిగ్గజం మెస్సీని తమ టీమ్‌లో చేర్చుకునేందుకు భారత ఫుట్‌బాల్‌ క్లబ్‌లు ఆసక్తి చూపిస్తున్నాయి.    బార్సిలోనాను వీడుతున్నట్లు మెస్సీ ప్రకటించగానే స్టార్‌ ఫుట్‌బాలర్‌ను తమ జట్టులో చేర్చుకునేందుకు రేసులోకి వచ్చినట్లు సోషల్‌మీడియాలో భారత ఫుట్‌బాల్‌ జట్లు ప్రకటించాయి.  దేశీయ ఫుట్‌బాల్ టోర్నీ ఇండియ‌న్ సూప‌ర్ లీగ్ (ఐఎస్ఎల్‌)కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ల‌భించిన విషయం తెలిసిందే.logo