శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Feb 21, 2020 , 14:59:42

ఆసీస్‌ టార్గెట్‌ 133

ఆసీస్‌ టార్గెట్‌ 133

హైదరాబాద్‌:  వుమెన్స్‌ వరల్డ్‌కప్‌లో ఇవాళ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇండియా తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 132 రన్స్‌ చేసింది.  సిడ్నీలో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.  ఓపెనర్‌ షఫాలీ వర్మ దూకుడుగా ఆడింది. ఆమె 15 బంతుల్లో 29 రన్స్‌ చేసింది. ఆట 4వ ఓవర్‌లో వర్మ.. నాలుగు బౌండరీలు కొట్టి మంచి స్టార్ట్‌ ఇచ్చింది. కానీ వర్మ ఇచ్చిన ఊపును ఇండియా జట్టు వినియోగించుకోలేకపోయింది. ఇండియన్‌ ఇన్నింగ్స్‌లో డీబీ శర్మ కీలక ఇన్నింగ్స్‌ ఆడింది. ఆమె 46 బంతుల్లో 49 రన్స్‌ చేసింది. శర్మ ఇన్నింగ్స్‌లో కేవలం మూడు ఫోర్లు మాత్రమే ఉన్నాయి. ఆస్ట్రేలియా బౌలర్‌ జోనస్సన్‌ రెండు వికెట్లు తీసుకున్నది. logo