మంగళవారం 27 అక్టోబర్ 2020
Sports - Sep 25, 2020 , 00:37:42

ఐపీఎల్‌కు సిద్ధమవుతున్నాం: మిథాలీ

ఐపీఎల్‌కు సిద్ధమవుతున్నాం: మిథాలీ

న్యూఢిల్లీ: యూఏఈలో జరుగనున్న మహిళల ఐపీఎల్‌ (టీ20 చాలెంజ్‌కప్‌) కోసం భారత క్రికెటర్లు ఎంతో ఎదురుచూస్తున్నారని వన్డే జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ చెప్పింది. నవంబర్‌ 1న ప్రారంభమయ్యే ఆ టోర్నీ కోసం సన్నద్ధతపై దృష్టి పెట్టామని గురువారం ఓ వెబినార్‌లో ఆమె వెల్లడించింది. కాగా ఈ ఏడాది మార్చిలో టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ తర్వాతి నుంచి భారత మహిళల జట్టు మరే మ్యాచ్‌ ఆడలేదు. కరోనా కారణంగా ఆరు నెలలుగా ఆట నిలిచిపోయింది. అయితే నవంబర్‌ 1 నుంచి యూఏఈ వేదికగా మహిళల ఐపీఎల్‌ జరిపేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆ టోర్నీ సన్నద్ధతపై మిథాలీ మాట్లాడింది. మునుపటిలా ఇప్పుడు ప్రాక్టీస్‌ చేసేందుకు వీలులేకపోవడం కాస్త సవాల్‌తో కూడుకున్నదేనని ఆమె చెప్పింది. 


logo