శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Mar 10, 2020 , 19:30:09

ప్రాక్టీస్‌లో భారత క్రికెటర్లు..

ప్రాక్టీస్‌లో భారత క్రికెటర్లు..

హిమాచల్‌ప్రదేశ్‌: భారత క్రికెటర్లు ధర్మశాల మైదానంలో ముమ్మరంగా ప్రాక్టీసు చేస్తున్నారు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సహా జట్టు ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. టీమిండియా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ ఆడనున్నది. తొలివన్డే ఈ నెల 12న ధర్మశాలలో జరుగనుంది. 15న లక్నోలో రెండో వన్డే, మూడో వన్డే 18న కలకత్తాలో జరగనున్నాయి. ఈ మూడు మ్యాచ్‌లు డే-నైట్‌ మ్యాచ్‌లే కావడం విశేషం. ఇటీవల న్యూజిలాండ్‌లో పర్యటించిన టీమిండియా టీ-20 సిరీస్‌ను 5-0తో వైట్‌వాష్‌ చేసి, వన్డే సిరీస్‌ను 0-3, టెస్టు సిరీస్‌ను 0-2తో కివీస్‌కు కోల్పోయింది. దీంతో, సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌లో రాణించి, పూర్వపు ఫామ్‌ అందుకోవాలని టీమిండియా తహతహలాడుతోంది.


logo