బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Feb 04, 2020 , 03:49:27

అమ్మాయిలకు ఆరు స్వర్ణాలు

అమ్మాయిలకు ఆరు స్వర్ణాలు
  • గోల్డెన్‌ గర్ల్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌

న్యూఢిల్లీ: అంతర్జాతీయ వేదికపై భారత బాక్సర్లు మరోసారి మెరిశారు. స్వీడన్‌ వేదికగా జరిగిన గోల్డెన్‌ గర్ల్‌ చాంపియన్‌షిప్‌లో మన అమ్మాయిలు అదిరిపోయే ప్రదర్శనతో 14 పతకాలు కొల్లగొట్టడంతో పాటు ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ దక్కించుకున్నారు. అందులో 6 స్వర్ణాలు ఉన్నాయి. టోర్నీలో బెస్ట్‌ బాక్సర్‌ అవార్డు కూడా మనవాళ్లకే దక్కింది. బాలికల విభాగంలో 5 స్వర్ణాలు, 3 రజతాలు, ఓ కాంస్యం రాగా.. యూత్‌ విభాగంలో ఒక స్వర్ణం, 4 కాంస్యాలు దక్కాయి. హర్యానాకు చెందిన ప్రాచీ ధన్కర్‌ (50 కేజీలు) చాంపియన్‌షిప్‌ ‘బెస్ట్‌ బాక్సర్‌' అవార్డు దక్కించుకుంది. 75 జట్లు పాల్గొన్న ఈ పోటీల్లో మనవాళ్లు చక్కటి ప్రదర్శన కనబర్చారని భారత బాక్సింగ్‌ సమాఖ్య (బీఎఫ్‌ఐ) సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
logo