టోక్యో: ఇండియన్ బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ ఒలింపిక్స్లో శుభారంభం చేసింది. మంగళవారం 64-69 కేజీల విభాగం రౌండ్ ఆఫ్ 16లో జర్మనీ బాక్సర్ నదైన్ అపెట్జ్పై 3-2తో విజయం సాధించింది. ఈ బౌట్ హోరాహోరీగా జరిగినా.. మూడు రౌండ్లలోనూ లవ్లీనా కాస్త ఆధిపత్యం ప్రదర్శించింది. మూడు రౌండ్లలోనూ ముగ్గురు జడ్జీలు లవ్లీనాకు 10 స్కోరు ఇవ్వగా.. ఇద్దరు 9 ఇచ్చారు. చివరికి 3-2తో గెలిచి తర్వాతి రౌండ్లో అడుగుపెట్టింది. ఆమెకు తొలి రౌండ్లో బై లభించడంతో నేరుగా రౌండ్ ఆఫ్ 16లో తన తొలి బౌట్ ఆడింది. క్వార్టర్స్ బౌట్ గెలిస్తే చాలు ఆమెకు కనీసం బ్రాంజ్ మెడల్ ఖాయమవుతుంది.