ఆదివారం 05 జూలై 2020
Sports - Jul 01, 2020 , 00:58:36

కూరగాయలు అమ్మిన అథ్లెట్‌

కూరగాయలు అమ్మిన అథ్లెట్‌

  • ఆర్థిక సాయం చేసిన జార్ఖండ్‌ ప్రభుత్వం 

రాంచీ: కుటుంబ పోషణ కోసం ఓ యువ అథ్లెట్‌ వీధుల్లో కూరగాయలు అమ్మిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జార్ఖండ్‌ రాష్ట్రంలోని రామ్‌గఢ్‌కు చెందిన  వాకర్‌ గీతా కుమారి కూరగాయలు అమ్ముతూ కుటుంబానికి సాయంగా నిలుస్తున్నది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకున్న సీఎం హేమంత్‌ సోరెన్‌.. గీతను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. తక్షణమే రూ.50వేల ఆర్థిక సహాయంతో పాటు ప్రతి నెలా ైస్టెఫండ్‌ కింద 3వేలు ఇవ్వాలని రామ్‌గఢ్‌ జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రామ్‌గఢ్‌ డిప్యూటీ కమిషనర్‌ సందీప్‌ సింగ్‌.. గీతకు సోమవారం చెక్‌తో పాటు స్పోర్ట్స్‌ సెంటర్‌లో శిక్షణ పొందేందుకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.  


logo