టోక్యో: భారత ఆర్చరీ ఆటగాడు ప్రవీణ్ జాదవ్ అత్యుద్భుత ప్రదర్శన కనబరిచాడు. టోక్యో ఒలింపిక్స్ వ్యక్తిగత విభాగం తొలి రౌండ్లో సూపర్ విక్టరీ కొట్టాడు. ప్రపంచ మేటి రెండవ ర్యాంక్ ఆటగాడు గాల్సన్ బాజజోపోవ్ను ఓడించాడు. 6-0 స్కోర్ తేడాతో గాల్సన్పై సంచలన విజయం నమోదు చేశాడు. రష్యాన్ ఒలింపిక్ కమిటీ(ఆర్ఓసీ)కి చెందిన గాల్సన్ను అతిసులువుగా ప్రవీణ్ మట్టికరిపించాడు. ఇక తదుపరి రౌండ్లో ప్రపంచ మేటి ప్లేయర్, నెంబర్ వన్ ఆటగాడు బ్రాడీ ఎలిసన్తో ప్రవీణ్ తలపడనున్నాడు. తొలిరౌండ్ తొలి సెట్లో ప్రవీణ్ 29, రెండవ సెట్లో 28, మూడవ సెట్లో 28 స్కోర్ చేశాడు. ఇక గాల్సన్ మొదటి మూడు సెట్లలో 27, 24, 24 స్కోర్ చేశాడు.