టోక్యో: ఒలింపిక్స్లో మరో ఇండియన్ ఆర్చర్ రౌండ్ ఆఫ్ 16లోనే ఇంటిదారి పట్టాడు. తొలి రౌండ్లో వరల్డ్ నంబర్ టూపై గెలిచి సంచలనం సృష్టించిన ప్రవీణ్ జాదవ్.. రెండో రౌండ్లో అమెరికా ఆర్చర్ ఎలిసన్ బ్రాడీ చేతిలో ఓడిపోయాడు. మూడు సెట్లలోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన బ్రాడీ.. 6-0తో ఈజీగా గెలిచాడు. ప్రవీణ్ తొలి సెట్లో 27, రెండో సెట్లో 26, మూడో సెట్లో 23 స్కోరు చేశాడు.