శుక్రవారం 10 జూలై 2020
Sports - Jun 04, 2020 , 00:12:26

‘టెస్టులు కష్టమే’

‘టెస్టులు కష్టమే’

న్యూఢిల్లీ: వెన్ను గాయం నుంచి కోలుకున్న తాను ఇప్పట్లో టెస్టు క్రికెట్‌ ఆడడం కష్టమేనని టీమ్‌ఇండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య చెప్పాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తన ప్రాధాన్యత తెలుసునని, అందుకే సంప్రదాయ ఫార్మాట్‌ ఆడేది సందేహమే అని బుధవారం ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 2018 ఆసియా కప్‌లో వెన్ను గాయమైనప్పుడు ఇక కెరీర్‌ ముగిసిందనుకున్నానని అన్నాడు. తాను క్లిష్ట సమయాల్లో ఉన్నప్పుడు ముంబై ఇండియన్స్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ తండ్రిలా తనకు ధైర్యం చెప్పాడని హార్దిక్‌ తెలిపాడు. 


logo