మంగళవారం 31 మార్చి 2020
Sports - Jan 31, 2020 , 12:31:51

టాస్ ఓడిన భార‌త్‌.. ప‌లు మార్పుల‌తో బ‌రిలోకి కోహ్లీ సేన‌

టాస్ ఓడిన భార‌త్‌.. ప‌లు మార్పుల‌తో బ‌రిలోకి కోహ్లీ సేన‌

వెల్లింగ్ట‌న్ వేదిక‌గా జ‌రుగుతున్న నాలుగో టీ 20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి భార‌త్‌ని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. భుజం గాయం కార‌ణంగా విలియ‌మ్సన్ విశ్రాంతి తీసుకోవ‌డంతో కెప్టెన్ బాధ్య‌త‌లు సౌథీకి ద‌క్కాయి. ఈ సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచి ప‌రువు ద‌క్కించుకోవాల‌ని బ్లాక్ క్యాప్స్ భావిస్తుండ‌గా, క్లీన్ స్వీప్ చేయాల‌ని టీమిండియా ప్ర‌ణాళిక‌లు వేస్తుంది. అయితే రెండు జ‌ట్లు ప‌లు ప్ర‌యోగాల‌తో నాలుగో టీ20 కోసం బ‌రిలోకి దిగుతున్నాయి. భార‌త్ విష‌యానికి వ‌స్తే రోహిత్‌, ష‌మీ, జ‌డేజా స్థానంలో సంజూ శాంస‌న్, సైనీ, వాషింగ్ట‌న్ సుంద‌ర్ టీంలోకి చేరారు. కివీస్ టీంలో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. విలియ‌మ్స‌న్‌,  డీ గ్రాండ్‌హోమ్ స్థానంలో టామ్ బ్రూస్‌, డ‌రైల్ మిచెల్ జ‌ట్టులో చేరారు. వెస్ట్‌ప్యాక్‌ స్టేడియంలో మొదట బ్యాటింగ్‌ చేసే జట్టు గెలిచే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. గత ఐదు మ్యాచ్‌ల్లో నాలుగుసార్లు ఇలాంటి ఫలితమే వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. 

జట్ల వివరాలు: 

 భారత్‌: కోహ్లీ(కెప్టెన్‌), సంజూ శాంస‌న్‌, రాహుల్‌,  అయ్యర్‌, పాండే, దూబే,  సుందర్‌, శార్దుల్‌, చాహల్ , సైనీ, బుమ్రా 


న్యూజిలాండ్‌:   టిమ్ సౌథీ(కెప్టెన్‌), గప్టిల్‌, మున్రో, టేలర్‌, మిచెల్‌, సిఫెర్ట్‌, సాంట్నర్‌, కుగెల్జిన్‌, బ్రూస్‌, సోధీ, బెన్నెట్‌ 


logo
>>>>>>