బుధవారం 27 జనవరి 2021
Sports - Dec 08, 2020 , 13:17:09

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న మూడో టీ20లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా. రెండో టీ20కి గాయంతో దూర‌మైన ఆరోన్ ఫించ్‌.. ఈ మ్యాచ్‌కు మ‌ళ్లీ ఆసీస్ కెప్టెన్‌గా వ‌చ్చాడు. ఆల్‌రౌండ‌ర్ స్టాయినిస్‌ను ఆస్ట్రేలియా ప‌క్క‌న పెట్టింది. ఇప్ప‌టికే సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉన్న కోహ్లి సేన‌.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాల‌ని చూస్తోంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా బ‌రిలోకి దిగుతోంది.


logo