శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Jan 24, 2020 , 11:29:56

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భార‌త్

టాస్ గెలిచి  బౌలింగ్ ఎంచుకున్న భార‌త్

ఆక్లాండ్ వేదిక‌గా భార‌త్- న్యూజిలాండ్ మ‌ధ్య జ‌రుగుతున్న తొలి టీ 20 మ్యాచ్‌లో భార‌త్ టాస్ గెలిచి బౌలింగ్  ఎంచుకుంది. పరుగుల వరద పారే ఈడెన్‌ పార్క్‌లో  ప్ర‌త్య‌ర్థిని త‌క్కువ స్కోరుకి క‌ట్ట‌డి చేసి మ్యాచ్ విజ‌యం సాధించాల‌ని భార‌త్ భావిస్తుంది. గాయ‌ప‌డ్డ‌  శిఖ‌ర్ ధావ‌న్ స్థానంలో  సంజూ శాంస‌న్ మ్యాచ్ ఆడ‌నున్న విష‌యం తెలిసిందే.

ఆస్ట్రేలియాతో సిరీస్ గెలిచిన ఉత్సాహంతో బ‌రిలోకి టీం ఇండియా దిగుతుండ‌గా, భార‌త్ విజ‌య‌ప‌రంప‌ర‌కి బ్రేక్ వేయాల‌ని న్యూజిలాండ్ క‌స‌ర‌త్తులు చేస్తుంది.  ఈ ఏడాది తొలిసారి విదేశీ ప‌ర్య‌ట‌న‌కి వెళ్లిన భార‌త్ ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడ‌నుంది. 


logo