భళా భారత్.. ఎనిమిది వికెట్ల తేడాతో ఆసీస్‌పై ఘన విజయం

అడిలైడ్ టెస్ట్‌లో దారుణంగా ఓడిపోయిన భారత్ ఇప్పుడు అందుకు తగ్గ ప్రతీకారం తీర్చుకుంది. ఆతిథ్య జట్టు ఆపసోపాలు పడ్డ పిచ్‌పై మన బౌలర్స్, బ్యాట్స్‌మెన్స్ అద్భుత ప్రతిభ కనబరిచి ఎనిమిది వికెట్ల తేడాతో రెండో టెస్ట్‌లో ఘన విజయం సాధించారు. ముఖ్యంగా భారత బౌలర్స్ బెబ్బులిలా విజృంభించి ఆస్ట్రేలియాని రెండు ఇన్నింగ్స్‌లలో 200 పరుగుల లోపే కట్టడి చేశారు. బంతులని రాకెట్లా విసరుతూ బుమ్రా, సిరాజ్‌లు ఆస్ట్రేలియాని గజగజ వణికిస్తే అశ్విన్, జడేజాలు తన మణికట్టు మాయాజాలంతో కంగారూలని కంగారెత్తించారు.
రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా, తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ కొద్దిగా ఇబ్బంది పడ్డప్పటికీ, శుభ్‌మన్ గిల్, రహానే, జడేజాల అద్భుత పోరాట పటిమతో తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులు చేశారు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా సరిగ్గా 200 పరుగులకు కుప్పకూలింది. ఆతిథ్య జట్టులో గ్రీన్ 45, వేడ్ 40, లబుషేన్ 28, కమిన్స్ 22 కాసేపు ప్రతిఘటించడంతో భారత్ విజయం కాస్త లేట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో సిరాజ్ 3, బుమ్రా, జడేజా, అశ్విన్‌కు తలో 2 వికెట్లు, ఉమేష్ ఒక వికెట్ తమ ఖాతాల్లో వేసుకున్నారు.
70 పరుగుల లక్ష్యంతో లంచ్ విరామం అనంతరం బ్యాటింగ్ చేపట్టిన టీ మిండియా ఆదిలో రెండు వికెట్లు వెంట వెంటనే కోల్పోయింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (5) పరుగులకు ఔట్ కాగా, పుజారా(3) పరుగులకు పెవీలియన్ బాట పట్టారు. తొలి టెస్ట్ ఆడుతున్న శుభ్‌మన్ గిల్(35) , స్టాండిన్ కెప్టెన్ రహానే(24)తో కలిసి భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. దీంతో సిరీస్ 1-1తో సమం అయింది. ఈ సిరీస్‌లో మరో టెస్ట్‌లు మిగిలి ఉండగా, ఎవరు ఆధిక్యం ప్రదర్శిస్తారో చూడాలి.
తాజావార్తలు
- బీజేపీలో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త
- నేపాల్, బంగ్లాకు 30 లక్షల డోసుల కొవిషీల్డ్ వ్యాక్సిన్
- కల్తీ కల్లు ఘటన.. మత్తు పదార్థాలు గుర్తింపు
- స్వాతిలో ముత్యమంత సాంగ్‌ని రీమిక్స్ చేసిన అల్లరోడు-వీడియో
- ఫస్టియర్ ఫెయిలైన వారికి పాస్ మార్కులు!
- సింగరేణిలో భారీగా ట్రైనీ ఉద్యోగాలు
- అమ్మకు గుడి కట్టిన కుమారులు..
- టర్పెంటాయిల్ పోసి నిప్పంటించిన ఘటనలో బాలుడి మృతి
- మాల్దీవుల్లో మంచు లక్ష్మీ రచ్చ.. ఫొటోలు వైరల్
- తదుపరి సినిమా కోసం కొత్త గెటప్‌లోకి మారనున్న అనుష్క..!