బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Feb 07, 2020 , 00:02:08

పుంజుకోవాల్సిందే..

 పుంజుకోవాల్సిందే..
  • నేడు ఇంగ్లండ్‌తో భారత మహిళల ఢీ

మెల్‌బోర్న్‌: ప్రపంచకప్‌ టోర్నీకి ముందు జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో మరోసారి ఇంగ్లండ్‌తో తలపడేందుకు భారత మహిళల జట్టు సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లిష్‌ జట్టుపై గెలిచినా గత మ్యాచ్‌లో పేలవ బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియా చేతిలో భారత్‌ నాలుగు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో బ్యాటింగ్‌లో పుంజుకొని ఇంగ్లండ్‌తో శుక్రవారం జరిగే మ్యాచ్‌లో సత్తాచాటాలని హర్మన్‌ప్రీత్‌ సేన పట్టుదలగా ఉంది. ముక్కోణపు సిరీస్‌లో ఫైనల్‌ చేరాలంటే గెలుపు కీలకమైన తరుణంలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్‌ను మెరుగుపరుచుకోవాలని భారత్‌ భావిస్తున్నది. సమస్యగా మారిన మిడిలార్డర్‌ గాడిలో పడాలని ఆశిస్తున్నది. వేద కృష్ణమూర్తి, రోడ్రిగ్స్‌ బ్యాట్‌ నుంచి భారీ ఇన్నింగ్స్‌ ఇంకా బాకీ ఉంది. బౌలింగ్‌లో పెద్దగా సమస్యలు లేకపోగా బ్యాటింగ్‌లో కూడా రాణిస్తే భారత జట్టుకు తిరుగుండదు. logo
>>>>>>