సోమవారం 30 మార్చి 2020
Sports - Feb 02, 2020 , 11:56:41

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్

మౌంట్‌ మాంగనీ: న్యూజిలాండ్‌ గడ్డపై చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న టీమిండియా ఐదో టీ 20 మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. గ‌త రెండు ‘సూపర్‌' థ్రిల్లర్‌ విజయాలతో కొండంత ఆత్మవిశ్వాసం నింపుకున్న భారత్ ఈ మ్యాచ్‌లోను గెలిచి వైట్ వాష్ చేయాల‌ని భావిస్తుంది. ఇక వ‌రుస ప‌రాజయాలు చ‌విచూస్తున్న కివీస్ టీం చివరి మ్యాచ్‌లో  గెలిచి  పరువు నిలబెట్టుకోవాల‌ని భావిస్తుంది. ఈ మ్యాచ్‌లో భార‌త్‌, న్యూజిలాండ్ ప‌లు మార్పుల‌తో బ‌రిలోకి దిగుతున్నాయి. కోహ్లీకి ఈ మ్యాచ్‌లో విశ్రాంతినివ్వ‌డంతో భార‌త టీం కెప్టెన్‌గా రోహిత్ ఉన్నారు. logo