సోమవారం 30 మార్చి 2020
Sports - Feb 06, 2020 , 00:45:19

నవనీత్‌కౌర్‌ డబుల్‌

 నవనీత్‌కౌర్‌ డబుల్‌

  • కివీస్‌పై భారత్‌ ఘన విజయం 

ఆక్లాండ్‌: న్యూజిలాండ్‌ పర్యటనను భారత మహిళల హాకీ జట్టు విజయంతో ముగించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 3-0తో కివీస్‌ను చిత్తుచేసింది. స్ట్రైకర్‌ నవనీత్‌కౌర్‌(45ని, 58ని) డబుల్‌ గోల్స్‌తో విజృంభించగా, షర్మిల(54ని) మరో గోల్‌ చేసింది. ఇరు జట్లు హోరాహోరీగా తలపడటంతో తొలి రెండు క్వార్టర్స్‌ ఎలాంటి గోల్‌ లేకుండానే ముగిశాయి. అయితే మూడో క్వార్టర్‌ 45వ నిమిషంలో నవనీత్‌ తొలి గోల్‌ చేసింది. 54వ నిమిషంలో కివీస్‌ గోల్‌కీపర్‌ను ఏమారుస్తూ షర్మిల  కండ్లు చెదిరే గోల్‌ కొట్టడంతో భారత్‌ ఆధిక్యం 2-0కు చేరుకుంది. మ్యాచ్‌ మరో రెండు నిమిషాల్లో ముగుస్తుందనగా నవనీత్‌ మరో గోల్‌ చేయడంతో భారత్‌ గెలుపు ఖరారైంది. ఈ టోర్నీలో జట్టు ప్రదర్శన పట్ల తాను సంతృప్తిగా ఉన్నట్లు చీఫ్‌ కోచ్‌ జోయర్డ్‌ మార్జిన్‌ అన్నాడు.   


logo