సోమవారం 06 ఏప్రిల్ 2020
Sports - Feb 04, 2020 , 20:24:11

అండర్‌-19..పాక్‌పై భారత్‌ ఘనవిజయం

అండర్‌-19..పాక్‌పై భారత్‌ ఘనవిజయం

పోచెప్‌స్ట్రూమ్‌ (దక్షిణాఫ్రికా): అండర్‌-19 ప్రపంచకప్‌ సెమీస్‌ లో పాకిస్థాన్‌పై భారత్‌ ఘనవిజయం సాధించింది. 173 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 35.2 ఓవర్లలో 176 పరుగులు చేసి గెలుపొందింది.  పాక్‌పై భారత్‌ వికెట్‌ నష్టపోకుండా విజయం సాధించడం విశేషం. జైశ్వాల్‌ -105 పరుగులు (నాటౌట్‌), సక్సేనా-59పరుగుల (నాటౌట్‌)తో జట్టును విజయపథంలో నడిపించడంతో..భారత్‌ ఫైనల్‌కు చేరుకుంది. ఈ నెల 9న పోచెప్ స్ట్రూమ్ లో జరుగనున్న ఫైనల్ లో భారత్ ఆడనుంది. 


logo