సోమవారం 06 ఏప్రిల్ 2020
Sports - Mar 13, 2020 , 00:41:49

నిలిచిన బెంగాల్‌

నిలిచిన బెంగాల్‌

రాజ్‌కోట్‌: బ్యాట్స్‌మెన్‌ సుదీప్‌  ఛటర్జీ(241 బంతుల్లో 8), వృద్ధిమాన్‌ సాహా(184బంతుల్లో 64), అనుస్తూప్‌ మజుందార్‌ (134 బంతుల్లో 58నాటౌ ట్‌) రాణించడంతో రంజీ ట్రోఫీ తుదిపోరులో బెంగాల్‌ పోటీలోకి వచ్చింది. మ్యాచ్‌ నాలుగో రోజైన గురువారం ఆట ముగిసే సమయానికి బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు కోల్పోయి 354పరుగులు చేసి, సౌరాష్ట్రకు 71పరుగుల దూరంలో నిలిచింది. క్రీజులో మజుందార్‌, అర్నబ్‌ నంది(82 బంతుల్లో 28నాటౌట్‌) ఉన్నారు. 


134పరుగులకు 3వికెట్ల వద్ద బెంగాల్‌  బరిలోకి దిగగా..సుదీప్‌  ఛటర్జీ, వృద్ధిమాన్‌  సాహా సహనంతో పోరాడారు. సౌరాష్ట్ర బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ తొలి సెషన్‌లో వికెట్‌ పడకుండా 89పరుగులు జోడించారు. ఆ తర్వాత ఛటర్జీ ఔట్‌ కాగా, కాసేపటికే సాహా పెలియన్‌ చేరడంతో బెంగాల్‌కు కష్టాలు పెరిగాయి. ఆ తర్వాత వచ్చిన మజుందార్‌ సాధికారికంగా ఆడాడు. నదీమ్‌(16) వెనుదిరిగినా కఠినతమైన పిచ్‌పై సహనం ప్రదర్శించాడు. ఆ తర్వాత అతడికి నంది సహకరించడంతో మరో వికెట్‌ పడలేదు. 


logo