శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Mar 10, 2020 , 00:28:32

కరోనా హైరానా

 కరోనా హైరానా

న్యూఢిల్లీ: ప్రమాదకర కరోనా వైరస్‌ హైరానా పుట్టిస్తున్నది. ఇప్పటికే పలు క్రీడా టోర్నీలు వాయిదా పడగా, మరికొన్ని అదే బాట పడుతున్నాయి. భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌ కోసం సోమవారం ఇక్కడకు చేరుకున్న దక్షిణాఫ్రికా జట్టు ముందస్తు జాగ్రత్తలు పాటించేందుకు సిద్ధమైంది. వైరస్‌ వ్యాప్తిచెందకుండా ఉండేందుకు తాము షేక్‌హ్యాండ్స్‌కు దూరంగా ఉంటామని జట్టు చీఫ్‌ కోచ్‌ మార్క్‌ బౌచర్‌ అన్నాడు. వైద్య బృందం సూచనల మేరకు తాము నడుచుకుంటామని బౌచర్‌ చెప్పుకొచ్చాడు. మరోవైపు వైరస్‌ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఇండియన్‌ వెల్స్‌ టోర్నీని రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ఆదివారం ప్రకటించారు. అమెరికాలో కరోనా కారణంగా రద్దయిన తొలి మెగా టోర్నీగా ఇది నిలిచింది. లాస్‌ఏంజిల్స్‌లో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించినందువల్ల ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. టోక్యో ఒలింపిక్స్‌ టార్చ్‌ రిలే కార్యక్రమం కూడా వైరస్‌ ప్రభావంతో  ప్రేక్షకులు లేకుండానే సాదాసీదాగా జరిగింది. ఇక ట్యూరిన్‌(ఇటలీ)లో జువెంటస్‌, ఇంటర్‌ మిలాన్‌ మధ్య మ్యాచ్‌  ప్రేక్షకులు లేకుండానే జరుగడం విశేషం. 

logo