బుధవారం 03 మార్చి 2021
Sports - Feb 12, 2021 , 01:43:29

ప్రాక్టీస్‌ ఫుల్‌..

ప్రాక్టీస్‌ ఫుల్‌..

చెన్నై: తొలి టెస్టులో ఓటమితో ఒత్తిడిలో పడ్డ భారత జట్టు.. గురువారం చెన్నైలో చెమటోడ్చింది. శనివారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టు కోసం టీమ్‌ఇండియా ఆటగాళ్లు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు. తొలి టెస్టులో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన షాబాజ్‌ నదీమ్‌ స్థానంలో అక్షర్‌ పటేల్‌ టెస్టు అరంగేట్రం చేయనుండటం దాదాపు ఖాయమైంది. అక్షర్‌ నెట్స్‌లో బౌలింగ్‌ చేస్తున్న వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన బీసీసీఐ ‘ఎవరు ప్రాక్టీస్‌ చేస్తున్నారో చూశారా’ అని వ్యాఖ్య జోడించింది. మోకాలి నొప్పితో తొలి టెస్టుకు దూరమైన అక్షర్‌ కట్టుతో కనిపించగా.. కోహ్లీ, పుజారా, రోహిత్‌, గిల్‌ సుదీర్ఘంగా బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు. తొలి టెస్టులో బ్యాట్‌తో ఆకట్టుకున్న వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌పై దృష్టిపెట్టగా.. జట్టు సభ్యులంతా కలిసి ఫీల్డింగ్‌ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. 

VIDEOS

logo