బుధవారం 27 జనవరి 2021
Sports - Dec 05, 2020 , 20:45:01

గెలిస్తే భారత్‌దే టీ20 సిరీస్‌

గెలిస్తే భారత్‌దే టీ20 సిరీస్‌

సిడ్నీ: విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్‌ జట్టు ఆతిథ్య ఆస్ట్రేలియాతో రెండో టీ20 మ్యాచ్‌కు సిద్ధమైంది.  ఆదివారం జరిగే మ్యాచ్‌లో కోహ్లీసేన గెలిస్తే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను  భారత్‌ మరో మ్యాచ్‌ మిగిలుండగానే కైవసం చేసుకుంటుంది. సిరీస్‌లో ఆశలు సజీవంగా ఉండాలంటే ఈమ్యాచ్‌లో కంగారూలు తప్పక గెలవాల్సి ఉండటంతో పోరు రసవత్తరంగా సాగనుంది.

తొలి టీ20లో భారత్‌ 11 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.   తలకు బంతి తగలడంతో రవీంద్ర జడేజా టీ20 సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. అతని స్థానంలో శార్దుల్‌ ఠాకూర్‌ను భారత జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ పేర్కొంది. 


logo