శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Jan 13, 2020 , 00:55:29

శాంసన్‌కు దక్కని చోటు

శాంసన్‌కు దక్కని చోటు

ముంబై: న్యూజిలాండ్‌తో ఈ నెల 24 నుంచి జరుగనున్న టీ20 సిరీస్‌ కోసం ప్రకటించిన జట్టులో వికెట్‌ కీపర్‌ సంజూ శాంసన్‌కు చోటు దక్కలేదు. లంకతో సిరీస్‌ నుంచి విశ్రాంతి తీసుకున్న వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, సీనియర్‌ పేసర్‌ మహమ్మద్‌ షమీ జట్టులోకి తిరిగొచ్చారు.  కివీస్‌ పర్యటనలో ఆతిథ్య జట్టుతో ఆడే ఐదు టీ20ల సిరీస్‌ కోసం 16 మందితో కూడిన భారత జట్టును ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ ఆదివారం ప్రకటించింది. సుదీర్ఘ కాలం బెంచ్‌పై నిరీక్షించిన అనంతరం లంకతో చివరి టీ20లో తుదిజట్టులో చోటు దక్కించుకున్న శాంసన్‌.. ఒక్క సిక్సర్‌ కొట్టి ఔటైన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌ టూర్‌లో జరిగే మూడు వన్డేలు, రెండు టెస్టుల కోసం జట్టును ఆదివారమే ప్రకటించాల్సి ఉన్నా.. సెలెక్షన్‌ కమిటీ తాత్కాలికంగా వాయిదా వేసింది. హార్దిక్‌ పాండ్య ఫిట్‌నెస్‌పై నెలకొన్న సందిగ్ధతే ఇందుకు కారణమని సమాచారం.
టీ20 జట్టు: కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌, రాహుల్‌, ధవన్‌, అయ్యర్‌, మనీశ్‌ పాండే, పంత్‌, శివం దూబే, కుల్దీప్‌, చాహల్‌, సుందర్‌, బుమ్రా, షమీ,  సైనీ, జడేజా, శార్దూల్‌.


logo