సోమవారం 23 నవంబర్ 2020
Sports - Oct 28, 2020 , 15:10:15

భారత్‌, ఆస్ట్రేలియా సిరీస్‌ షెడ్యూల్‌ ఇదే..!

 భారత్‌, ఆస్ట్రేలియా సిరీస్‌ షెడ్యూల్‌ ఇదే..!

న్యూఢిల్లీ:  ఆస్ట్రేలియా పర్యటన కోసం  వన్డే, టీ20, టెస్టు జట్లను బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే.   తాజాగా ఆస్ట్రేలియాలో టీమ్‌ఇండియా పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను  ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు(సీఏ) విడుదల చేసింది. అడిలైడ్‌లో డే/నైట్‌ టెస్టు మ్యాచ్‌ జరగనుంది.  నవంబర్‌ 27 నుంచి పరిమిత ఓవర్ల క్రికెట్‌  సిరీస్‌ సిడ్నీ, కాన్‌బెర్రాలో నిర్వహించనున్నారు. డిసెంబర్ 17 నుంచి నాలుగు టెస్టుల సిరీస్‌ ఆరంభంకానుంది. 

డిసెంబర్‌ 27న సంప్రదాయ బాక్సింగ్‌ డే టెస్టు(రెండో టెస్టు) మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో జరుగుతుంది.  జనవరి 7 నుంచి ఎస్‌సీజీలో మూడో టెస్టు మొదలుకానుంది.  నాలుగో టెస్టు జనవరి 15 నుంచి బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా నిర్వహించనున్నారు. సుదీర్ఘ ఆసీస్‌ పర్యటన కోసం విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు నవంబర్‌ 12న సిడ్నీ చేరుకుంటుంది. 

షెడ్యూల్‌:

వన్డేలు:

1st ODI, November 27 – SCG ((Day-Night))

2nd ODI, November 29 – SCG (D/N)

3rd ODI: December 2 – Canberra (D/N)

టీ20లు:

1st T20I: December 4 – Canberra (Night)

2nd T20I: December 6 – SCG (Night)

3rd T20I: December 8 – SCG (Night)

టెస్టులు:

1st Test: December 17-21 – Adelaide Oval (D/N)

2nd Test: December 26-30 – MCG

3rd Test: January 7-11 – SCG

4th Test: January 15-19 – Brisbane